ETV Bharat / city

మూడేళ్ల పాలనలో సీఎం జగన్​ ప్రజలకు చేసిందేమీ లేదన్న తెదేపా నేతలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

TDP leaders fire on YSRCP మద్యం తాగితేనే పథకాలు అమలవుతాయన్నట్లు జగన్​ రెడ్డి పాలన ఉందని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్‌ విశ్వసనీయత నేడు ఏమైందని నిలదీశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జగన్ పలికినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు.

TDP NIMMALA AND AYYANNA
TDP NIMMALA AND AYYANNA
author img

By

Published : Aug 16, 2022, 4:16 PM IST

MLA Nimmala Ramanaidu: మూడేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారని తెలుగుదేశం నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. అందుకే ప్రతిపక్షాలపై, మీడియాపై దుర్భాషలకు దిగారన్నారు. జగన్‌ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను జనం నమ్మే స్థితిలో లేరన్న నిమ్మల.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇసుక రద్దుతో భవన కార్మికులను రోడ్డున పడేసి ఉద్ధరించినట్లు మాట్లాడారని మండిపడ్డారు. జగన్ ప్రమాణస్వీకారం రోజున పెన్షన్ రూ.3వేలు చేస్తానని సంతకం పెట్టిన ఫైల్​కు నేడు దిక్కులేదని దుయ్యబట్టారు. 3, 4, 5వ తరగతులను హైస్కూల్​లో విలీనం చేయడంతో విద్యార్థులు కాలువలు, చెరువులు, శ్మశానాలు దాటి స్కూళ్లకు వెళ్లాల్సివస్తోందని రామానాయుడు అన్నారు.

Ayyanna Patrudu: వైకాపా మూడేళ్ల పాలన పూర్తి అయినప్పటికీ.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కుటుంబ డాక్టర్ పథకం పేరుతో ఆగస్ట్ 15న.. కొత్త పథకాన్ని శ్రీకారం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అవగాహన లేని పథకాలను అమలు చేస్తామని నమ్మించడం తగదన్నారు.

వైకాపా నేతలపై తెదేపా ధ్వజం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.