TDP leaders on repalle rape incident: రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు చూస్తే పరిస్థితి బిహార్‌ను మించిపోయిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం వలనే తాజాగా ఓ వలస కూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగిందని ఆరోపించారు. నిద్రపోతున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్యని లోకేశ్ ధ్వజమెత్తారు.
-
అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.(3/3)#APUnsafeForWomen
— Lokesh Nara (@naralokesh) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.(3/3)#APUnsafeForWomen
— Lokesh Nara (@naralokesh) May 1, 2022అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.(3/3)#APUnsafeForWomen
— Lokesh Nara (@naralokesh) May 1, 2022
రాష్ట్రంలో ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లాలో రోజుకో రేప్ జరుగుతోందన్న లోకేశ్.. ప్రభుత్వం ఎదురుదాడి మాని మహిళలపై నేరాలను అదుపుచేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని హితవుపలికారు. రాబోయే రోజుల్లో మహిళలు పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లే భయానక పరిస్థితులు తలెత్తొచ్చునని విమర్శించారు.
-
ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్... పూటకో రేప్. బీహార్ ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై..(1/3) pic.twitter.com/VX3zhDgzZ5
— Lokesh Nara (@naralokesh) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్... పూటకో రేప్. బీహార్ ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై..(1/3) pic.twitter.com/VX3zhDgzZ5
— Lokesh Nara (@naralokesh) May 1, 2022ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్... పూటకో రేప్. బీహార్ ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై..(1/3) pic.twitter.com/VX3zhDgzZ5
— Lokesh Nara (@naralokesh) May 1, 2022
హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాల వల్లే రేప్‌లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని వాపోయారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
పీఎస్‌కు వెళ్లినా స్పందించలేదు.. రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై అత్యాచారాన్ని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు. భర్తను బెదిరించి భార్యపై ముగ్గురు అత్యాచారం చేయడం దారుణమని మండిపడ్డారు. భర్త పీఎస్‌కు వెళ్లి ఎన్నిసార్లు తలుపు కొట్టినా స్పందించలేదని అనగాని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ బిహార్‌లా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ఇంట్లో ఉన్నా, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోందని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
తెదేపా శ్రేణుల ఆందోళన.. రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో.. నిందితులను కఠినంగా శిక్షించాలని తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూలీ పని కోసం వచ్చిన మహిళపై అత్యాచారం చేయడం బాధాకరమన్నారు.
రాష్ట్రాన్ని ప్రభుత్వం గంజాయి వనంగా మార్చిందని.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ధ్వజమెత్తారు. గంజాయి తాగి మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారని ఆక్షేపించారు. వలస కూలీలుగా.. మహిళలు త్వరలో ఏపీ నుంచి పక్క రాష్ట్రాలు వెళ్లే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో 1000 రోజుల జగన్ పాలనలో వేయి మంది మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగాయని ఆరోపణలు చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.10 లక్షలు పరిహారమివ్వాలి: ఎమ్మార్పీఎస్
అత్యాచారానికి గురైన దళిత మహిళకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, పిల్లలకు ప్రభుత్వమే చదువులు చెప్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిలకా కిరణ్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు కిషోర్ డిమాండ్ చేశారు. దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌మోహన్‌రెడ్డి దళితులకు పరిహారం అందించటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జీజీహెచ్‌కు కాకుండా బాధితురాలిని ఒంగోలు రిమ్స్‌కు తరలించటమేమిటంటూ అంబులెన్స్‌కు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని పక్కకు లాగి, అంబులెన్స్‌ను ఒంగోలుకు పంపారు.
సీఎం స్పందించరే: నాదెండ్ల మనోహర్
రేపల్లెలో ఎస్సీ మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితికి దర్పణమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. హోం శాఖను, పోలీసుల్ని నిర్వీర్యం చేయటం వల్లే రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందన్నారు.
ఇదీ చదవండి: