ETV Bharat / city

అసమర్థ పాలనతో.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలా?: తెదేపా - పదో తరగతి ఫలితాలపై తెదేపా నేతల విమర్శలు

TDP on SSC Results: అసమర్థ పాలనతో విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతారా ? అని జగన్​పై తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలోనూ రాజకీయమా అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అని మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ సీఎం జగన్​.. పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తారా ? అని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Lokesh on 10th Results
Lokesh on 10th Results
author img

By

Published : Jun 4, 2022, 5:18 PM IST

Nara Lokesh on SSC Results: ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వైకాపాను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలోనూ రాజకీయమా? అని మండిపడ్డారు. మంత్రికి సమాచారం లేకుండా ఫలితాల వెల్లడి తేదీ ప్రకటించారని.. వాటిని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా అని లోకేశ్​ నిలదీశారు. పిల్లల భవిష్యత్తుతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు.. తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందన్నారు. ఇంతకీ ఫలితాలు వాయిదా వేసింది.. మంత్రి అలిగారనా? అని లోకేశ్‌ నిలదీశారు.

Atchannaidu on SSC Results Postpone: కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ సీఎం జగన్​.. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‎పరీక్ష ఫలితాలను చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో విద్యార్థులకు.. సీఎం, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ చేతకాని పాలనతో విద్యార్థుల భవిష్యత్​తో ఆటలాడుతారా అని అచ్చెన్న మండిపడ్డారు. 'మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. విద్యాశాఖ మంత్రిని చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్పా.. రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య ‎మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారాయి' అని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి జగన్‌ చేసిన కృషి శూన్యమని అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.