తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రామానాయుడు గవర్నర్ బిశ్వభూషణ్‌కు లేఖ రాశారు. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థికసాయాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌లో ఇస్తున్న రూ.1000 నగదు, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అన్నట్లు వైకాపా నేతలు నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్‌కు వివరించారు.
సామాజిక దూరం పాటించకుండా సమూహంగా వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నేతలు కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సిబ్బంది పంపిణీ చేయాల్సిన సాయాన్ని వైకాపా నేతలు పంచుతున్నారని ఆరోపించారు. రూ.1000 నగదు పంపిణీలో వైకాపా నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల బరిలోని అధికార పార్టీ అభ్యర్థులు దీనిని ప్రచారంలా వాడుకుంటున్నారని విమర్శించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండీ... దీపాలు వెలిగించాలని సీఎం ట్వీట్.. స్పందించిన ప్రధాని