ఓట్లేసిన ప్రజల పట్ల విశ్వాసం చూపాల్సిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి(cm jagan).. పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకున్న ఎన్నికల నిధులకే విశ్వాసం చూపుతూ రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్నీ కబ్జాలే కనిపిస్తున్నాయి. వైకాపా నేతలు తమ జేబులు నింపుకోవటమే రాష్ట్రాభివృద్ధిగా భావిస్తున్నారు.
"కేసీఆర్(kcr)కు కృతజ్ఞతగా.. రాష్ట్ర పరిశ్రమల్నీ తెలంగాణ(telangana)కు పంపేందుకు తోడ్పడుతున్నారు. అమెజాన్(amazon) హైదరాబాద్కు తరలిపోవటమే ఓ ఉదాహరణ. మూడు ముక్కల రాజధానికి తెరలేపటంతోనే అభివృద్ధి మొత్తం నాశనమైంది. చంద్రబాబు(chandrababu) దూరదృష్టితో వేసిన బీజాల వల్లే.. కోకాపేట ప్రాంతంలో ఇప్పుడు ఎకరా రూ.60కోట్లు పలుకుతోంది. అభివృద్ధిలో పోటీపడాలనే జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకపోవటం దురదృష్టకరం" అని దుయ్యబట్టారు.
సీఎంకు సామంతులుగా..
వైకాపా(ycp) ఎమ్మెల్యేలు, ఎంపీలు.. జగన్‍కు సామంతులుగా పని చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(kollu ravindra) విమర్శించారు. ప్రజల నుంచి దోచుకున్న దాంట్లో సగం సీఎంకు కప్పం కడుతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు.. వైకాపా పరోక్షంగా సహకరిస్తోందని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తూతూమంత్రంగా తీర్మానం చేసి.. చేతులు దులుపుకున్నారని ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి:
Ys Sharmila : 'రాసి పెట్టుకోండి...నేను ప్రభంజనం సృష్టిస్తా..'