ETV Bharat / city

నూతన ఇసుక విధానం... ఎవరి ప్రయోజనాల కోసం?: తెదేపా

నూతన ఇసుక విధానం ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని.. తెదేపా నేతలు కొల్లు రవీంద్ర, కొమ్మారెడ్డి పట్టాభి... ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇసుక తవ్వకం, స్టాక్ యార్డ్ నిర్వహణను జేపీ వెంచర్స్​కు అప్పగించడం క్విడ్ ప్రోకోలో భాగమేనన్నారు. ప్రభుత్వ తీరుతో.. ఉపాధి లేక ఎందరో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.

tdp leaders fires on ycp on giving sand contract to jp ventures
నూతన ఇసుక విధానం ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు: తెదేపా
author img

By

Published : Mar 23, 2021, 3:07 PM IST

నూతన ఇసుక విధానం ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భవన నిర్మాణ రంగంపైనే ఎక్కువ ప్రభావం పడిందని విమర్శించారు. ఉచిత ఇసుక విధానాన్ని నిలిపివేసిన కారణంగా.. ఉపాధి లేక ఎందరో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కొత్తగా జేపీ వెంచర్స్​కు ఇసుక రీచ్ అప్పగించడం క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించారు.

నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారు

కమీషన్లకు కక్కుర్తి పడే.. నాసిరకం మద్యాన్ని రాష్ట్రంలో అధిక ధరలకు అమ్ముతున్నారని విమర్శించారు. అధిక ధరలకు మద్యం కొనలేక.. ప్రజలు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని ఆరోపించారు. మద్యం తాగకూడదనే ధరలు పెంచామని చెప్తున్న ప్రభుత్వం.. నిత్యావసర వస్తువుల ధరలనూ ప్రజలు ఏం తినకూడదని పెంచిందా అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

ఇసుక కుంభకోణంపై సమాధానం చెప్పాలి

పది వేల కోట్ల రూపాయల ఇసుక కుంభకోణంపై సమాధానం చెప్పాలంటూ.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కరపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చి, వేలకోట్ల రూపాయల అవినీతికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని మంత్రి పెద్దిరెడ్డి.. వందల కోట్ల ప్రజాధనాన్ని పత్రికా ప్రకటనలకు వెచ్చించటం సిగ్గుచేటని విమర్శించారు.

ఇదీ చదవండి:

భారత్ బంద్​కు తెదేపా మద్దతు: అచ్చెన్నాయుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.