ETV Bharat / city

'జగన్ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గర ప‌డింది' - లోకేశ్ తాజా వార్తలు

TDP Fire On Jagan: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై.. వైకాపా, తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చిన్నమ్మ ఉమామహేశ్వరి మృతితో విషాదంలో ఉంటే ఆస్తి కోసం హత్య చేయించినట్లు.. వైకాపా నేతలు విషప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వక్తం చేశారు. తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌నుకున్న నీచ చరిత్ర జగన్‌ది అని విమర్శించారు. బాబాయి గొడ్డలిపోటుకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

లోకేశ్‌
లోకేశ్‌
author img

By

Published : Aug 3, 2022, 8:40 PM IST

NTR's daughter Uma Maheswari Death: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైకాపా, తెదేపా మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. ఆస్తి కోసం చంద్రబాబు కుటుంబమే.. ఉమామహేశ్వరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ వైకాపా నేతలు కిరాయిగాళ్లతో సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం చేస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh on YSRCP: చిన్నమ్మ మరణంపై డోర్‌ నెంబర్‌కి సర్వే నెంబర్​కి తేడా తెలియని కిరాయిగాళ్లతో విష‌ప్రచారం చేయిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి చిన్నమ్మ ఉమామ‌హేశ్వరి మ‌ర‌ణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. చిన్నమ్మ మ‌ర‌ణంతో తాము విషాదంలో ఉంటే.. విష‌ప్రచారం చేస్తూ వినోదం పొందుతున్న జగన్ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గర ప‌డిందన్నారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ నాటకమాడారని మండిపడ్డారు. తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌ని సంత‌కాలు చేసిన నీచ చ‌రిత్ర జ‌గ‌న్‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం బాబాయ్ మ‌ర్డర్‌నీ వాడుకున్నారని ఆరోపించారు.

  • చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతావా? నీ పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. మీరు చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు.(4/4)#FakeJagan#YSRCPcheapPolitics

    — Lokesh Nara (@naralokesh) August 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా నేతలు శవరాజకీయాలకు తెరలేపారని నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారని నిలదీశారు. మూడు తరాల రక్త చరిత్ర కలిగిన జగన్.. తెలుగుదేశంపై బురద చల్లే కుట్రలు హాస్యాస్పదమని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం గురించి జగన్ మరోసారి మాట్లడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

నెత్తుటి కూడు తినే రక్తచరిత్రకు వారసుడు జ‌గ‌న్‌రెడ్డి

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.