రివర్స్ టెండరింగ్... స్వప్రయోజనాల కోసమా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమా అన్న విషయాన్ని సీఎం జగన్ తెలపాలని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. రివర్స్ టెండరింగ్‌తో నాణ్యత తగ్గితే... గోదావరి జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో ఆటలాడే హక్కు జగన్‌కి ఎవరిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబుపై బురద జల్లేందుకే పోలవరాన్ని ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆరోపించారు.
నిపుణుల కమిటీ అధికారులతో ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని ధ్వజమెత్తారు. నవయుగ కంపెనీకి రూ.781కోట్లు అడ్వాన్స్ చెల్లించారని నిపుణుల కమిటీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వరరావును ఎందుకు పక్కనపెట్టారని నిలదీశారు. వైకాపా నేతలు అమరావతికి గ్రహణం పట్టించారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. ఎక్కడ కమీషన్లు వస్తాయని చూసుకుంటూ... ప్రతి ప్రాజెక్టుకు మళ్లీ టెండర్లు పిలిపిస్తున్నారని ఆరోపించారు. అవగాహన లేని ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి గ్రహణం పట్టిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండీ