ETV Bharat / city

విజయవాడ, తిరువూరులో తెదేపా ప్రచార జోరు

పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. ఆయా మున్సిపాలిటీల్లో ప్రచారం జోరందుకుంది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​రావు, తిరువూరులో మాజీ మంత్రి కేఎస్​ జవహర్​లు ప్రచారం నిర్వహించారు. తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులకే పట్టం కట్టాలని అభ్యర్థించారు.

author img

By

Published : Mar 7, 2021, 6:23 PM IST

tdp leaders campaigning for their candidates in vijayawada and tiruvuru
విజయవాడ, తిరువూరులో తెదేపా ప్రచార జోరు

అభివృద్ధి కావాలనుకుంటే తెదేపా అభ్యర్థులను గెలిపించాలని.. విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు ఓటర్లను కోరారు. 12వ డివిజన్​లో తమ పార్టీ అభ్యర్థి సాయిబాబు తరుఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటి పన్నుల పెంపు విషయంలో తెదేపావి అసత్య ఆరోపణలు అని.. అధికార పార్టీ నాయకులు చెప్పడంలో నిజం లేదని స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే పన్నుల భారం తప్పదని... ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. అమరావతి రాజధాని కోరుకునే ప్రతిఒక్కరూ తెదేపాకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

కృష్ణాజిల్లా తిరువూరులో 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోదా చెన్నకేశవరావుకు మద్దతుగా.. మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి తప్ప.. రెండేళ్లలో వైకాపా చేసింది శూన్యమని ఆరోపించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'తెదేపా నేతల వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.