ETV Bharat / city

Varla Ramaiah: హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు సిగ్గుపడాలి: వర్ల రామయ్య - election news

ఎన్నికల సిబ్బందిపై నమ్మకం లేకనే కౌంటింగ్ కేంద్రాల వద్ద న్యాయస్థానం ప్రత్యేకాధికారుల్ని (Special officers at counting centers) నియమించిందని తెదేపా నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. కోర్టు నిర్ణయం ఎస్ఈసీ, పోలీస్ శాఖ పనితనాన్ని బహిర్గతం చేసిందని దుయ్యబట్టారు.

హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు సిగ్గుపడాలి

author img

By

Published : Nov 16, 2021, 5:39 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక అధికారుల్ని (Special officers at counting centers) నియమించాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు సిగ్గుపడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల సిబ్బందిపై నమ్మకం లేకనే న్యాయస్థానం ప్రత్యేకాధికారుల్ని నియమించిందన్నారు. న్యాయస్థానం నిర్ణయం ఎస్ఈసీ (SEC), పోలీస్ శాఖ పనితనాన్ని తప్పుపట్టినట్లైందని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ వెబ్ కాస్టింగ్​పై (Web Costing) నమ్మకం లేక తాము ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి, వైకాపా పాలకుల అరాచకాలు అన్ని రోజులూ సాగవని హెచ్చరించారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తారని నైజీరియన్ జర్నలిస్టు రాష్ట్ర పరిస్థితుల్ని గమనించే బ్లాగ్ (Blog) పెట్టారన్నారు. సాధారణ దొంగల్ని వెంటాడి పట్టుకునే పోలీసులు..,రాజకీయ దొంగలకు మాత్రం రక్షణ కల్పిస్తూ జీ హుజూర్ అంటున్నారని ఆరోపించారు.

హైకోర్టు ఏం ఆదేశించిందంటే..

కుప్పం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని హైకోర్టు (high court on kuppam election counting) ఆదేశించింది. హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్​ను విచారించి ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను న్యాయస్థానం (hc on counting of votes at kuppam) ఆదేశించింది. కౌంటింగ్ వీడియో రికార్డింగ్​ను సోమవారం హైకోర్టుకు సమర్పించాలని కమిషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి

HIGH COURT: కుప్పం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక అధికారిని నియమించండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.