ETV Bharat / city

Payyavula: 'ఇంకెంతకాలం ఈ పిట్టకథలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి' - ఆర్థిక మంత్రిపై పయ్యావుల కామెంట్స్

Payyavula On YSRCP Govt: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త పెట్టుబడులు తీసుకురాలేక రాష్ట్రాన్ని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి

author img

By

Published : Jan 29, 2022, 3:49 PM IST

Payyavula Keshav On State Loans: జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని తెదేపా సీనియర్‌ నేత, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇంకెంతకాలం పిట్టకథలతో నెట్టుకొస్తారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంతో స్పష్టం చేయాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువని ఆరోపించారు. కొత్త పెట్టుబడులు రాక రాష్ట్రాన్ని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల మాదిరి ఎందుకు జీతాలు ఇవ్వటం లేదని పయ్యావుల నిలదీశారు. మరో తరం పాటు రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా ? అని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని పయ్యావుల ఎద్దేవా చేశారు.

"ఇంకెంతకాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక పరిస్థితిపై బుగ్గన పొంతన లేని ప్రకటన విడుదల చేస్తున్నారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంతో స్పష్టం చేయాలి. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువ. కొత్త పెట్టుబడులు రాక రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు." -పయ్యావుల కేశవ్, తెదేపా సీనియర్ నేత

ఇదీ చదవండి : cm jagan letter to pm modi : 'కోరినంత మంది ఐఏఎస్‌లను ఇస్తాం.. ఎవర్ని పంపాలో మేం నిర్ణయిస్తాం'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.