ETV Bharat / city

TDP Pattabhi: చివరకు పాఠశాల పిల్లలకు ఇచ్చే చిక్కీల్లోనూ వైకాపా నేతల అవినీతి: పట్టాభి - Pattabhi ram news

TDP Pattabhi On Chikki Tenders: పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే చిక్కీల్లోనూ వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి సురేశ్ ముఖం చాటేశారని.. ఆధారాలతో అవినీతి బయటపెట్టినా మంత్రి ఎందుకు స్వీకరించలేకపోతున్నారని పట్టాభి ప్రశ్నించారు.

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
TDP Pattabhi
author img

By

Published : Feb 2, 2022, 7:55 PM IST

TDP Pattabhi On Chikki Tenders in AP: పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే చిక్కీల్లోనూ అవినీతికి పాల్పడి వైకాపా నేతలు.. పందికొక్కుల్లా మెక్కుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రి కమీషన్ల కోసం కక్కుర్తిపడి వాళ్లకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి ఆదిమూలపు సురేశ్ బుకాయిస్తున్నారని పట్టాభి ఆరోపించారు. బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరన్నారు.

ప్రభుత్వ రంగ సంస్ధలకు కాదని వేరే కంపెనీలకు టెండర్లు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తే.. ఆ కంపెనీలు తెలుగుదేశం నేతలవి అంటూ అసత్య ప్రచారం చేస్తారా ? అని పట్టాభి ధ్వజమెత్తారు. టెండర్లు కట్టబెట్టిన కంపెనీ ఎన్​సీసీఎల్ కేంద్ర భాగస్వామ్యంతో ఉన్న కంపెనీ కాదా ? అని ప్రశ్నించారు. చిన్న పిల్లకు ఇచ్చే చిక్కీల విషయంలో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందని రెండు రోజుల క్రితం వెల్లడించిన విషయాన్నీ పట్టాభి గుర్తు చేశారు.

పిల్లలకు ఇచ్చే చిక్కీల్లో అవినీతిపై మంత్రి ఆదిమూలపు సురేశ్​కు సవాల్ విసిరినా.. ఆధారాలతో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లినా మంత్రి కనిపించలేదు. ఆధారాలు బయటపెట్టినా మంత్రి ఎందుకు స్వీకరించలేకపోతున్నారు. తెదేపా సవాల్​ స్వీకరించలేక మంత్రి ముఖం చాటేశారు. భూమి, ఇసుక సహా అన్నిటిలోనూ అవినీతి చేసిన వైకాపా.. చివరకు చిన్నపిల్లకు ఇచ్చే చిక్కీల్లోనూ అవినీతికి పాల్పడింది. -పట్టాభి, తెదేపా అధికార ప్రతినిధి

ఇదీ చదవంది..

TDP MP KANAKAMEDALA: ఎస్సీ వర్గీకరణపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.