ETV Bharat / city

NARA LOKESH CHITCHAT: జైలుకెళ్లడానికైనా సిద్దం : నారా లోకేశ్

author img

By

Published : Oct 21, 2021, 7:45 PM IST

తాను జైలుకెళ్లడానికైనా సిద్దంగా ఉన్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తెలిపారు. తానేం దేశాన్ని దోచి జైలుకెళ్లడం లేదని చెప్పారు. పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా అని ప్రశ్నించారు.

నారాలోకేశ్
నారాలోకేశ్

తాను జైలుకెళ్లడానికైనా సిద్దంగా ఉన్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తెలిపారు. తానేం దేశాన్ని దోచుకుని జైలుకెళ్లడం లేదని చెప్పారు. పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా అని ప్రశ్నించారు. మైదుకూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు.. హత్యకు ప్రేరేపించడం కాదా అని నిలదీశారు. తెదేపా పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో సీఎం జగన్ డిఫెండ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. సీఎం జగన్ తీరుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని.. దానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.

తెదేపా గుర్తింపు రద్దు చేయమని వైకాపా ఫిర్యాదు చేసుకున్నా నష్టం లేదన్నారు. కేజీ గంజాయికి ఇంత అని ముడుతుండడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తోందని ఆరోపించారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం బాగా భుజాలు తడుముకుంటోందని మండిపడ్డారు. తాము ఫెయిలయ్యామన్న విషయం తెలుసుకునే.. పీకే రంగంలోకి దిగుతున్నాడని కెబినెట్​లో జగన్ పీకే విషయాన్ని ప్రస్తావించారని విమర్శించారు.

దిల్లీకి వెళ్లి డ్రగ్స్, గంజాయి గురించి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ కార్యాలయంపై దాడి విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. వైకాపా ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోమని.. తలలు పగులుతాయని ఘాటుగా హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఏపీలో పోలీసింగ్ దెబ్బతిందని విమర్శించారు. పోలీసింగ్ దెబ్బతినడం వల్లే గంజాయి సాగు, సరఫరా పెరుగుతోందని ఆరోపించారు. గంజాయి సాగు, సరఫరా పెరుగుతున్నా.. సీఎం కట్టడి చేయడం లేదని ధ్వజమెత్తారు. డ్రగ్స్ కట్టడి చేయకుంటే ఓ జనరేషన్ దెబ్బ తింటుందని.. దానిని అరికట్టేందుకే తాము దృష్టి పెట్టామని తెలిపారు.

గతంలోనూ రోడ్లు, ధరల పెరుగుదల విషయంలోనూ ఆందోళన చేపట్టామని గుర్తుచేశారు. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా సహకరించాలని సజ్జలే కోరారని.. ఇప్పుడు తెదేపా పోటీ కూడా చేయలేకపోతోందని అంటున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

Remand: తెదేపా నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.