ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కొయ్యనపేట గ్రామంలో కుటుంబసభ్యుల కళ్లెదుటే మృతి చెందిన అసిరినాయుడు మృతిపై లోకేశ్ స్పందించారు. కరోనా కాటుకు ఆంధ్రప్రదేశ్ శవాలగుట్టగా మారుతుంటే జగన్ మాత్రం తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి శాలువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కాదు కదా, శ్మశానంలో పాడె కూడా దొరకడంలేదని దుయ్యబట్టారు. ఈ మేరకు అసిరినాయుడు మరణానికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాకు జత చేశారు.
ఇదీ చదవండి: