సీఎం జగన్ వచ్చి రోడ్డుకు అడ్డంగా పడుకున్నా.. చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకోలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. హిందూ ధర్మంపై దాడిని సీఎం జగన్, పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్లు కట్టారని.. ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: