TDP Leader Nara Lokesh: ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతూనే ఉంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టంచేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ మరణాలు సహా అన్ని విషయాల్లోనూ జగన్ నవ్వుతూ... అబద్దాలు ఆడేస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. తెదేపా హయాంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలోనూ రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారని.. రాష్ట్రపతి, ప్రధానిలకే అబద్దాలు చెప్పగలిగిన ఘనుడు జగన్ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో లోకేశ్ చిట్‌చాట్ నిర్వహించారు.
ప్రజల ప్రాణాలంటే జగన్‌కు ఎంత లోకువో..
జంగారెడ్డిగూడెం మరణాలపై నాలుగు రోజులపాటు సాగదీస్తున్నారంటూ.. ప్రభుత్వం విమర్శలు అర్ధరహితమని మండిపడ్డారు. పేదల ప్రాణాలంటే జగనుకు ఎంత లోకువో జంగారెడ్డిగూడెం ఘటనతో స్పష్టమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి సహజ మరణాలైతే ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు.. సారా బట్టీలపై ఎస్ఈబీ దాడులు ఎందుకు అని నిలదీశారు.
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని తమ విధానం
రాజధానిపై తమకు స్పష్టత ఉందని.. ప్రభుత్వానికే స్పష్టత కొరవడిందని ధ్వజమెత్తారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని తమ విధానమని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. పరిపాలన కేంద్రీకృతంగా ఉండాలని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు.. వ్యవస్థలు శాశ్వతమని నమ్మే వ్యక్తి కాబట్టే సీఆర్డీఏ చట్టాన్ని రైతులకు అనుకూలంగా చేశారని గుర్తుచేశారు.
అలా చేసి ఉంటే జగన్‌కి అధికారం దక్కేదా..?
పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేయలేదని తేల్చిచెప్పిన ఆయన.. ఆ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా? అని నిలదీశారు. తెదేపా తప్పులు వెతకడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారని గుర్తుచేశారు. సహజంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఒప్పందాలు చేసుకుంటారు. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదన్నారు. చట్ట వ్యతిరేక చర్యలను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరని లోకేశ్ స్పష్టంచేశారు.
విశాఖ కేజీహెచ్‌లో అపహరణ.. శ్రీకాకుళం జిల్లాలో గుర్తించిన పోలీసులు