కరోనా కష్ట కాలంలో రైతులను ఆదుకోవటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసా పేరుతో అన్నదాతలను మోసం చేశారంటూ మండిపడ్డారు. ఒకే దఫాలో రూ. 13,500 ఇస్తామని.. గతంలో ఇచ్చిన హామీని విస్మరించారన్నారు.
రైతు రుణమాఫీ జీవో రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న మర్రెడ్డి.. కేవలం రూ. 7,500 మాత్రమే చెల్లిస్తూ రూ. 13,500 తామే ఇస్తున్నట్లు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 6,000 చొప్పున ఐదేళ్లలో రూ. 30,000 నష్టం చేకూర్చారని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: