ఎదుటి మనిషిని ప్రేమించి, నిస్వార్థంగా సేవచేయడం ఎంత గొప్ప విషయమో.. ప్రపంచానికి చాటిన కరుణామూర్తి మదర్ థెరిసా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పేదలు, రోగులు, అనాథలకు అమ్మగా నిలిచి తన జీవితాన్ని వారి సేవకే అంకితం చేసిన మానవతామూర్తి అని కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా ఆ మాతృమూర్తి సేవా స్ఫూర్తితో నిర్భాగ్యులకు అండగా నిలుద్దామన్నారు.
ఒక వర్గం మీడియా, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను ఎక్కువ చేసి చూపిస్తోందంటూ.. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారని నారా లోకేష్ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో 8 నెలల్లోనే ముగ్గురు బాలికలపై అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. నిందితులకు శిక్ష దేవుడెరుగు.. కనీసం బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని విమర్శించారు. ఈ ఘటనలకు సంబంధించిన వార్తలన్నీ జగన్ సొంత మీడియా సాక్షిలోనే వచ్చాయన్న ఆయన.. మీడియాపై బురద చల్లి బ్లాక్ మెయిల్ చేసే ఫ్యాక్షన్ బుద్ధికి ఇకనైనా స్వస్తీ చెప్పారని హితవుపలికారు. రమ్యకు 21రోజుల్లో న్యాయం చేస్తామన్నారని..ఇంకా 10 రోజులే మిగిలాయని గుర్తుచేశారు.
ఇదీ చదవండి..