TDP leader Bonda Uma వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారన్నారు. హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే... తీవ్ర పరిణామాలు ఉంటాయని బోండా ఉమ హెచ్చరించారు. పడుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక చవితి పండుగ సంప్రదాయాలకు తగ్గట్లు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు జరపాలనటం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ పాలన ఉందని విమర్శించారు. తుగ్లక్ నిబంధనలకు భయపడకుండా ప్రజలు వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటే... అందుకు తెదేపా అండగా ఉంటుందని బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: