Atchannaidu: వికేంద్రీకరణ పేరుతో వైకాపా విధ్వంసం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించేందుకే వికేంద్రీకరణ రాగం పాడుతున్నారని విమర్శించారు. అమరావతితో అభివృద్ధి వికేంద్రీకరణ జరగదంటూ అసత్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. మూడేళ్లు నోరువిప్పని ధర్మాన.. మంత్రి పదవి రాగానే సీఎం మెప్పు కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికింది ఎన్టీఆర్ అని.. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చేసి చూపించింది చంద్రబాబు అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
"వికేంద్రీకరణ పేరుతో వైకాపా విధ్వంసం చేస్తోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించేందుకే వికేంద్రీకరణ రాగం. అమరావతితో అభివృద్ధి వికేంద్రీకరణ జరగదంటూ అసత్యాలు చెబుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికింది ఎన్టీఆర్. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చేసి చూపించింది చంద్రబాబు. వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేసింది." -అచ్చెన్నాయుడు
మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రను కబళించేందుకు రాబందులు వస్తున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో ముందుకెళ్తామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో వైకాపా నాయకులు 40 వేల ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. విశాఖలో జరిగిన భూదోపిడీపై విచారణకు డిమాండ్ చేశారు. తెల్లారేసరికల్లా భూముల డాక్యుమెంట్లు మారిపోతున్నాయని విశాఖవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు.
మూడు రాజధానుల అజెండాపై జగన్కు నమ్మకం ఉంటే.. అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు. విశాఖలో మూడు బెడ్రూం ఇల్లు తప్ప ఏం లేదన్న విజయసాయికి.. అన్ని ఎకరాలు ఎలా వచ్చాయని నిలదీశారు. శ్రీకాకుళం, అరసవల్లి ధర్మాన జాగీరా అని ప్రశ్నించారు. తనకు ఒళ్లు పెరిగినా బుర్ర కూడా ఉందని.. మంత్రి బొత్సకు బుర్ర కూడా లేదని దుయ్యబట్టారు.
"సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో ముందుకెళ్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు కొట్టేశారు. విశాఖలో భూదోపిడీపై విచారణ జరపాలి.
విశాఖవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాల ఎలా వచ్చాయి?." -అచ్చెన్నాయుడు
ఇవీ చదవండి: