ETV Bharat / city

ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్‌ ప్రభుత్వం మనుషుల్లా చూడటం లేదు: అచ్చెన్న - Dalit groups call for Andhra Pradesh bandh

బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలపై దాడులకు నిరసనగా దళిత సంఘాలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్​కు తెదేపా సంఘీభావం తెలియజేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Achennaidu
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
author img

By

Published : Nov 7, 2020, 2:00 PM IST

జగన్ ఏడాదిన్నర పాలనలో ఎస్సీలపై రాష్ట్ర వ్యాప్తంగా 1200కుపైగా దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు, శిరోముండనాలు, అత్యాచారాలు, అక్రమ అరెస్టులు, భూకబ్జాలుపై పోరాటంలో భాగంగా దళిత సంఘాలు చేపట్టిన ఏపీ బంద్​కు తెదేపా సంఘీభావం ఉంటుందని ప్రకటించారు.

ఫాసిస్టులు, నియంతల అకృత్యాలను మించిన పాలన ఏపీలో సాగుతోందని మండిపడ్డారు. ఎస్సీలంతా మూకుమ్మడిగా ఓట్లేసి అధికారం కట్టబెట్టింది ఈ అవమానాలు భరించేందుకేనా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మనుషుల్లా చూడకుండా నియంతృత్వ ధోరణితో వారి ఆత్మాభిమానాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆక్షేపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికితే, నేడు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేశారని విమర్శించారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోకపోగా... ఎస్సీల హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.

దేశంలో అమలవుతున్న అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాదని... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపట్ల గౌరవం లేకుండా వారిపై చేస్తున్న దౌర్జన్యాలను ఖండిస్తున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఘటనలను ముఖ్యమంత్రి ఖండించకపోవటం దుర్మార్గమన్న ఆయన.. వైకాపా నేతలు చట్టాలను కీలు బొమ్మల్లా మార్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలంతా ఒకేతాటిపైకి వచ్చి హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెదేపా కృషి చేస్తుందని అచ్చెన్న స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: లబ్ధిదారులకు ఇళ్లు వెంటనే ఇవ్వాలి: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.