మెున్నటి వరకూ.. పార్టీ కార్యక్రమాలంటే.. వేల మంది కార్యకర్తలు. నేతలకు జయ జయ ధ్వనాలు. పార్టీ సైనికులంతా.. ఒక్కసారి అరిస్తే.. ఆ సందడే వేరు. ఇక ఏటా జరిగే.. మహానాడు అంటే.. 'తెలుగు' తమ్ముళ్లకు పెద్ద పండగే. ఎక్కడున్నా.. కార్యక్రమానికి వచ్చి వాలిపోతారు. అయితే... ఈసారి.. 'పసుపు పండగ' డిజిటల్ ఫ్లాట్ ఫాం పైకి చేరింది. ఆన్లైన్లోనే జెండా ఆవిష్కరించింది.
- తెదేపా..జూమ్.. జూమ్
జూమ్ యాప్.. ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫాం పై వచ్చిన ఓ పెద్ద మార్పు. మీటింగ్లు పెట్టాలన్నా.. గ్రూప్ డిస్కషన్స్ చేయాలన్నా.. టక్కున గుర్తొస్తుందీ పేరు. కానీ వేల మంది కార్యకర్తలతో తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'మహానాడు'ను .. ఈ డిజిటల్ ఫ్లాట్ పై నిర్వహించడమనేది.. పెద్ద ప్రయోగమే. మహానాడు అంటే.. తెదేపాకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. కార్యకర్తలతో మమేకమయ్యే.. పెద్ద సమావేశం. అలాంటిది.. కరోనా కారణంగా.. బాధ్యతగా.. డిజిటల్ ఫ్లాట్ ఫాం వైపు అడుగులేసింది. దేశంలోనే ఇలా ఓ పార్టీకి చెందిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నిర్వహించడమనేది తెదేపాకే చెల్లింది. పది.. ఇరవై మంది.. కాదు ఏకంగా 14 వేల మందితో ఇలా 'వర్చువల్ మహానాడు'ను తెదేపా నిర్వహించింది.
- భవిష్యత్లో ఇంతేనా..?
ఆన్లైన్లో 'మహానాడు' కార్యక్రమం.. అనేది ఓ ముందడుగు. ఈ ప్రయోగంతో భవిష్యత్లో చాలా రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద సభలకు బదులుగా.. డిజిటల్ సమావేశాలు పెట్టే.. అవకాశం ఉంటుందేమో. ఒక రాజకీయ పార్టీ.. వేల మందిని డిజిటల్ వేదికపైకి తెచ్చి.. పార్టీ కార్యక్రమం నిర్వహించడం దేశంలోనే తొలిసారి.
- మహానాడు ఎప్పుడు మెుదలైంది?
తెలుగు తమ్ముళ్లు కలుసుకునే వార్షిక వేడుక మహానాడు. పార్టీ కార్యక్రమాలను సమీక్షించుకోవడానికి.. భవిష్యత్ నిర్దేశానికీ మహానాడే వేదిక. తొలిమహానాడు 1982 ఏప్రిల్ లో జరిగింది. అదే ఏడాది మే 27, 28 తేదీల్లో మరోసారి జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా... మే 26,27, 28, 29 తేదీల్లో ఏవైనా రెండు లేదా మూడు రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తారు. మే 28 పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం కావడంతో క్రమం తప్పకుండా ఈ రోజుల్లోనే నిర్వహిస్తున్నారు. మధ్యోలో వచ్చిన కొన్ని అవాంతరాలు మినహా... అన్ని సందర్భాల్లోనూ .. ఇప్పుడే జరిగింది. ప్రస్తుతం అమరావతి వేదికగా జరుపుతున్న మహానాడు 30వది. ఇందులో మొత్తం 20తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది.
ఇదీ చదవండి: విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?