ETV Bharat / city

మారణాయుధాలతో దాడి చేస్తే.. నామమాత్రపు కేసులా?: తెదేపా - తెదేపా

TDP complaints to cp: రౌడీయిజాన్ని నమ్ముకున్నవాళ్లు ఎవరూ బాగు పడలేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా నేతల దాడిలో కన్ను కోల్పోయిన చెన్నుపాటి గాంధీని పరామర్శించిన ఆయన.. ఓటమి భయంతోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు దాడిలో పాల్గొన్న వారి నేరచరిత్రను తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు అందజేశారు.

Tdp complaints to cp
తెదేపా ఫిర్యాదు
author img

By

Published : Sep 5, 2022, 6:54 PM IST

Updated : Sep 6, 2022, 6:48 AM IST

చెన్నుపాటి గాంధీని పరామర్శిస్తున్న చంద్రబాబు, తెదేపా నేతలు

Tdp complaints to cp: ‘మిమ్మల్ని కూడా ఎవరైనా కొట్టి కన్ను పోగొడితే.. ఏదో ఎమోషనల్‌గా కొట్టారనే చెబుతారా? మీ కుటుంబసభ్యులకు ఇలా జరిగితే ఉదాసీనంగా ఉంటారా?’ అని విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తెదేపా నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు చేసిన దాడిలో ఆయన కన్నుపోయి, రెటీనా దెబ్బతిని, విపరీతంగా రక్తస్రావమైతే.. ఆ దాడి ఏదో ఎమోషనల్‌గా జరిగిందని నిందితులకు సీపీ కొమ్ము కాయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై హత్యానేరం కింద కేసు పెట్టి, బెయిలు రాకుండా చేయాల్సిన కమిషనర్‌.. వారిపై కేసు పెట్టకపోగా వత్తాసు పలకడమేంటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే గాంధీపై దాడి జరిగిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి.. హైదరాబాద్‌లోని ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాంధీని ఆయన సోమవారం పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎంతమందిని కొడతారు? ఎంతమంది కళ్లు పొడుస్తారు? జనం రాబట్టి పారిపోయారు గానీ... లేకపోతే గాంధీ రెండో కన్నునూ వైకాపా నాయకులు పొడిచేసేవారు. ఇంత ఘోరం జరిగితే దాడి చేసినవాళ్లపై కేసు పెట్టకుండా, గాంధీపై కేసు పెట్టాలని చూశారు. గాంధీపై దాడి చేసినవాళ్లకు ఒకటే చెబుతున్నాను... మీకు, మీ కుటుంబానికి ఇలాంటిదే జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే ఊరుకునేది లేదు ఖబడ్దార్‌..! ఈ రోజుతో అంతా అయిపోదు. రేపు, ఎల్లుండి కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే వైకాపా నాయకుల అరాచకాలపై మహిళలు తిరగబడుతున్నారు. త్వరలోనే వైకాపా నాయకులు వీధుల్లో తిరగలేని రోజొస్తుంది’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘వైకాపా నాయకులు రౌడీయిజాన్ని నమ్ముకున్నారు. అలాంటివాళ్లెవరూ బాగుపడలేదు. హత్యలు చేసేవారికి పోస్ట్‌మార్టం తప్పదని నేనెప్పుడూ చెబుతుంటాను. హత్యా రాజకీయాల్ని తెదేపా ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది’ అని పేర్కొన్నారు.

.
.

దాడి చేసినవారిని వదిలిపెట్టం

గాంధీపై దాడి దారుణమని, ఇలాంటి ఉన్మాదాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యా రాజకీయాలు, వేధింపులు, దౌర్జన్యాలేనని, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి, జైలుకి పంపడం దానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. ‘గాంధీ కన్ను పొడవడం కక్షపూరిత చర్య. దోషుల్ని వదిలిపెట్టం. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న గాంధీపై ప్రభుత్వమే దాడి చేయించింది. గతంలో విజయవాడలో పట్టాభి ఇంటిపైనా దాడిచేశారు. ఆ రోజే దోషులపై కఠినచర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మా నోరు మూయిస్తే ఇంకెవరూ నోరు తెరవరని అనుకోవడం పొరపాటు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

పూరింట్లో ఉండి ప్రజాసేవ చేస్తున్న వ్యక్తి గాంధీ

‘గాంధీ నీతి, నిజాయతీగా పనిచేసే వ్యక్తి. అందుకే మూడుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన భార్య కార్పొరేటర్‌. గాంధీ పూరింట్లో ఉండి సేవ చేస్తూ ప్రజాదరణ పొందిన వ్యక్తి. ఇదివరకు ఎమ్మెల్సీ అశోక్‌బాబు అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి వెళ్లి, అక్కడికి దగ్గర్లోనే ఉన్న గాంధీ ఇంటికీ వెళ్లాను. ఆయన ఎంత నీతినిజాయతీగా ప్రజాసేవ చేస్తున్నారో వాళ్ల ఇల్లు చూస్తేనే తెలుస్తుంది. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండి కూడా ఒక చిన్న పూరింటిలో ఉన్న కుటుంబాన్ని చూసి నేనే షాకయ్యాను. అలాంటి వ్యక్తిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను’ అన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక మళ్లీ రౌడీ మూకలు పేట్రేగుతున్నాయి

‘ఒకప్పుడు గొడవలకు మారుపేరుగా ఉండే విజయవాడను, నేను ముఖ్యమంత్రి అయ్యాక ప్రశాంతనగరంగా మార్చాను. వైకాపా అధికారంలోకి వచ్చాక మళ్లీ రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయి’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు ఇలాగే తమాషా చూస్తుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. వైకాపా నాయకుల దుర్మార్గాలకు తెదేపా అడ్డుగా ఉంది కాబట్టే పార్టీ నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘మొన్నటివరకు తప్పుడు కేసులు, ఇప్పుడు దాడులు కొనసాగిస్తున్నారు. వాటికి తెదేపా కార్యకర్తలెవరూ భయపడరు’ అని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

విజయవాడ సీపీని కలిసిన తెదేపా నేతలు

చెన్నుపాటి గాంధీపై దాడి కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు... విజయవాడ పోలీస్ కమిషనర్‌ కాంతిరాణాటాటాను కలిశారు. మారణాయుధాలతో దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా నామమాత్రపు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన దాడేనని రామ్మోహన్‌ అన్నారు. నిందితుల నేర చరిత ఆధారంగా కఠిన సెక్షన్లు నమోదు చేయాలని తెలుగుదేశం నేతలు సీపీని కోరారు.

ఇదీ జరిగింది: తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు హత్యాప్రయత్నం చేయడంతో ..బెజవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మళ్లీ రౌడీయిజానికి ఆజ్యం పోసేలా వైకాపా వ్యవహరించిన తీరు స్థానికులను సైతం కలవరపరుస్తోంది. గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.

తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. విజయవాడలో కార్పొరేటర్‌గా గాంధీ 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 9డివిజనుకు ఆయన భార్య కాంతిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సాయంత్రం 9వ డివిజన్‌లో పైపులైను లీకేజీపై ఫిర్యాదులు అందితే ...దగ్గరుండి కార్పొరేషన్‌ సిబ్బందితో ఆయన పనులు చేయిస్తుండగా.. కొంతమంది వైకాపా నేతలు అక్కడికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం హయాంలో నీ పెత్తనమేంటంటూ వాగ్వాదానికి దిగారు. ఆ డివిజన్‌కే చెందిన వైకాపా అధ్యక్షుడు గద్దె కళ్యాణ్, వైకాపా ఇంఛార్జ్‌ వల్లూరి ఈశ్వరప్రసాద్, కార్యకర్త సుబ్బుతో పాటు మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. ముష్టి ఘాతాలు కురిపించారు. ఇనుప చువ్వతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో అతని కుడికన్ను దెబ్బతింది. స్థానికులు అడ్డుపడటంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. చెన్నుపాటి గాంధీని ద్విచక్రవాహనంపై తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వైకాపా దాడిని తీవ్రంగా ఖండించారు.

ప్రణాళికా ప్రకారమే చెన్నుపాటి గాంధీపై దాడి చేసినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. పటమటలంక తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవిత ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో అంతా కలిసి వేడుకలు చేసుకునేవారు. ఈ మధ్య పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో చవితి వేడుకలు తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో రాజకీయ కక్షతో దాడి చేశారనే మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 6, 2022, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.