'ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కమిషనర్ గిరిజా శంకర్, ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెల్లింపులు చేసినట్లుగా న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టు వాయిదాకు రెండు రోజుల ముందు ఏదో ఒక ఆర్డర్ పుట్టించి చెల్లింపులు జిల్లాలకు పంపినట్లుగా నాటకాలాడుతూ కాలయాపన చేస్తున్నారు. న్యాయస్థానానికి చెప్పినట్లుగా ఏ జిల్లాలోనూ రూ.5లక్షల లోపు బిల్లులు చెల్లించలేదు. న్యాయస్థానాల్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు చెప్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు' అని బీద రవిచంద్ర అన్నారు.
అఖిల భారత సర్వీసు అధికారులుగా ఉండి వైకాపా నేతలుగా వ్యవహరిస్తున్న అధికారుల్ని కోర్టుకు లాగాల్సిన పరిస్థితులు వచ్చాయని బీద రవిచంద్ర ఆరోపించారు. పనులు చేసిన మాజీ ప్రజా ప్రతినిధులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. చేసిన పనులకు జిల్లాల్లో 21.02శాతం, మండల స్థాయిలో 6 శాతం మేర నిధులు ఆపి మిగిలిన చెల్లింపులు చేయాలంటూ అడ్డగోలు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పెండింగ్ బకాయిలు రాక ఇప్పటికే 50మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. విడుదల చేశామని చెప్తున్న నిధుల్ని తక్షణమే చెల్లించకుంటే ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, డ్వామా కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి అధికారులకు వినతిపత్రాలు ఇస్తామని.. రవిచంద్ర అని వెల్లడించారు.
ఇదీ చదవండి: CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్!