చెత్త సేకరణ ప్రజారోగ్యంలో భాగమైనప్పుడు చెత్త సేకరణపై చార్జీలు ఏ విధంగా వసూలు చేస్తారని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు ప్రశ్నించారు. విజయవాడలో చెత్త సేకరణపై యూజర్ చార్జీలను వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అన్నారు. నగరవాసులు కట్టిన పన్నుల్లో స్థానిక సంస్థలకు వాటాలు ఇవ్వాలని.. ప్రస్తుతం ఆ వాటా చాలా తగ్గించేశారన్నారు. పన్నుల వాటా తగ్గించి ప్రజల వద్ద యూజర్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవాలని సూచించడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తంలో స్థానిక సంస్థలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి సీఎం జగన్