ETV Bharat / city

యువకుని కిడ్నాప్​.. అరగంటలోనే ఛేదించిన పోలీసులు - kidnap cases in vijayawada

విజయవాడలో యువకుని కిడ్నాప్​ కలకలం రేపింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు అరగంటలోనే కేసును ఛేదించి యువకుడిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు.

యువకుని కిడ్నాప్​.. అరగంటలోనే ఛేదించిన పోలీసులు

author img

By

Published : May 31, 2020, 11:38 AM IST

Updated : May 31, 2020, 11:59 AM IST

కిడ్నాప్​ కేసు దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు

విజయవాడకు చెందిన ఓ యువకుడిని కిడ్నాపర్ల చెర నుంచి తాడేపల్లి పోలీసులు రక్షించారు. కేసు నమోదైన అరగంటలోనే ఛేదించారు. విజయవాడకు చెందిన శేఖర్ అనే యువకుడు నగరంలోని ఓ వ్యక్తి వద్ద కారు తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం శేఖర్​ను తాడేపల్లికి చెందిన కొందరు దుండగులు కృష్ణలంక వద్ద అపహరించారు.

యువకుని తండ్రికి ఫోన్​ చేసి తమకు శేఖర్​ అప్పు ఉన్నాడని రూ.4 లక్షల బకాయిలు వెంటనే చెల్లించాలని.. లేకుంటే శేఖర్​ను చంపేస్తామని డిమాండ్​ చేశారు. దీనిపై శేఖర్​ తండ్రి శనివారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు 30 నిమిషాల్లోనే యువకుణ్ని కాపాడి.. కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇదీ చూడండి:

రైళ్లలో వచ్చేవారికి కరోనా పరీక్షలపై సందిగ్ధత!

Last Updated : May 31, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.