పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ తాజా పరిస్థితిపై తెలుగు రాష్ట్రాలు మూడు వారాల్లో నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను శుక్రవారం జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఎంఆర్‌షాలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. వివరాలు అందజేయడానికి కొంత గడువు కావాలని ఏపీ తరఫు అడ్వకేట్ జీఎన్‌రెడ్డి ఆన్ రికార్డ్స్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణలో, నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. నివేదికను మూడు వారాల్లో సమర్పించకుంటే ఉభయ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులూ స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
"ఉపాధ్యాయుల భర్తీపై నివేదికను సమర్పించండి"
ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన సరిగా లేదని సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై నివేదికకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.