లారీ యజమానుల నుంచి ఎగుమతి దిగుమతి కూలి, మాముళ్లు వసూలు, గుమస్తా రుసుములు, ఆశీలు, కాటా ఛార్జీలను నిలిపివేయాలని 'ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్' డిమాండ్ చేసింది. గతంలో ఇటువంటి వ్యవస్థ ఉండేది కాదని, ఇప్పుడు టన్నుకు, బస్తాకు డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు వాపోయారు.
కిరాయి ఇచ్చే సమయంలో సరకు యజమాని గుమస్తా రుసుం పేరుతో 2 నుంచి 4 శాతం వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని అరికట్టాలని ఆల్ ఇండియా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆదేశాలతో తాము రాష్టంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈశ్వరరావు తెలిపారు. కొవిడ్‌తో ఇప్పటికే కుదేలైన లారీ యజమానులు ఈ రుసుముల కారణంగా మరింత ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దీనిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ది ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. అన్ని జిల్లా లారీ అసోసియేషన్లకు దీనిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కుపై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు'