ETV Bharat / city

సీఎం జగన్​ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు: తెదేపా

ప్రజలను వైకాపా మోసం చేయడం ప్రారంభించి పదేళ్లైందని.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో రాష్ట్రాన్ని తెదేపా రెండో స్థానంలో నిలపగా.. వైకాపా 12 స్థానానికి నెట్టేసిందన్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు.

author img

By

Published : Mar 13, 2021, 7:45 PM IST

tdp leaders allegations on cm jagan
సీఎం జగన్​పై తెదేపా నేతల విమర్శలు

జగన్ అంటేనే.. లక్షలాది బాధితులు, వేల మంది నేరచరితులని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గురించి వైకాపా మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రెండేళ్ల పాలనతో సంక్షేమానికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. పార్టీ ఆవిర్భావం నాటికి.. ప్రజలను వైకాపా మోసం చేయడం ప్రారంభించి పదేళ్లైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు పదిమంది పారిశ్రామికవేత్తలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. వైకాపాకు వాటాలు ఇవ్వాల్సి వస్తుందనే వారు వెనక్కి తగ్గారని ఆరోపించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ఏపీని తెదేపా ప్రభుత్వం రెండో స్థానంలో నిలిపితే.. వైకాపా 12వ స్థానానికి నెట్టిందని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ దుయ్యబట్టారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను రాయలసీమకు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును దూషించే మంత్రులు వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని.. జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రిని నిలదీయలేరా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గానికి రూ.663 కోట్లు కేటాయించి.. మిగతా వాటికి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.

ఇదీ చదవండి:

కలెక్టర్​​పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.