రాష్ట్రంలోనే విజయవాడ పశ్చిమ.. మోడల్ నియోజకవర్గంగా మారనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అందుకు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
ఊర్మిళానగర్లో 14వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి కోటి ఐదు లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐదు సి. సి.రోడ్ల నిర్మాణ పనులకు, చర్చి సెంటరులో రూ 35 లక్షల అంచనా వ్యయంతో బి.టి. రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్ధాపన చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేస్తున్నామని, త్వరలో అసంపూర్తిగా ఉన్నస్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: