వైద్యులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త నిరసనల పిలుపు మేరకు విజయవాడలో డాక్టర్లు ఆందోళన చేపట్టారు. వైద్యులను రక్షించే చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన రోగుల సంబంధీకులు మానసిక ఆవేదనలో ఉంటారని, వారి పరిస్థితిని అర్థం చేసుకోగలమని వైద్యులు అన్నారు. పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని... అనుకోని సందర్భాల్లో రోగి మృతి చెందితే వైద్యులపై దాడులు చేయటం సరైంది కాదన్నారు.
"డాక్టర్లు దేవుళ్లు కాదు. మేము మనుషులమే. దాడుల వల్ల డాక్టర్ల మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఆ ప్రభావం మరి కొంతమంది రోగులపై పడే అవకాశం ఉంది. వైద్యులకు ప్రజలు, రోగులు, వారి బంధువులు సహకరించాలి. డాక్టర్ల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు చేయాలి" -రాహుల్, జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు
"వైద్యులపై దాడుల వల్ల ప్రజలే నష్టపోతారని గ్రహించాలి. భయంతో డాక్టర్లు తీసుకునే నిర్ణయాల వల్ల రోగికి అందించే చికిత్సలో లోపాలు జరిగే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో డాక్టర్లు వైద్యం అందించే పరిస్థితి ఉండాలి. వైద్యులపై దాడులకు సంబంధించి నిర్ధిష్టమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం" -రవీంద్ర, వైద్యుడు
ఇదీ చదవండి: 'యడవల్లి దళిత, గిరిజన వీకర్స్ సొసైటీ భూములపై సీఎం సమాధానం చెప్పాలి'