ETV Bharat / city

హైదరాబాద్​లో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల వద్ద ప్రత్యేక చర్యలు - హైదరాబాద్​లో అపార్టుమెంట్లలలో కరోనా వార్తలు

తెలంగాణలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. హైదరాబాద్​లోని గేటెడ్​ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల వద్ద కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సందర్శకులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, పల్స్‌రేటు తనిఖీలు చేపడుతున్నారు.

Special activities at gated communities and apartments
హైదరాబాద్​లో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల వద్ద ప్రత్యేక చర్యలు
author img

By

Published : Jul 23, 2020, 10:44 AM IST

గ్రీన్‌ఎవెన్యూలో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

  • తెలంగాణలో హైదరాబాద్​ నిజాంపేటలోని గ్రీన్‌ఎవెన్యూ గేటెడ్‌ కమ్యూనిటీ. 101 విల్లాలు ఉన్నాయి. సంక్షేమ సంఘం తరఫున కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చే సందర్శకులకు నిత్యం థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంతోపాటు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేలా చూస్తారు. పల్స్‌ ఆక్సీమీటర్‌తో పల్స్‌రేటు తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే అనుమతించడం లేదు. ఎవరి ఇంటికి బంధువులు వచ్చినా ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్గత వీధుల్లో శానిటేషన్‌ చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
  • బాచుపల్లిలోని హిల్‌కౌంటీ వాసులు కరోనాపై యుద్ధమే చేస్తున్నారు. ఇక్కడ 326 కుటుంబాలు ఉంటున్నాయి. సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. ఎవరైనా కాలనీలో మాస్కుల్లేకుండా తిరిగితే వెంటనే ధరించేలా చూస్తారు. శానిటేషన్‌, బ్లీచింగ్‌ వంటివి నిత్యం పర్యవేక్షిస్తుంటారు. కాలనీలోకి వచ్చేవారికి ఉష్ణోగ్రతలు చూస్తున్నారు.
  • నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్‌, కోకాపేట, నార్సింగి, మణికొండ, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు కరోనా మహమ్మారి తమ ఛాయలకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.వివిధ బ్లాకులకు వెళ్లే దారుల్లో సోడియం హైపోక్లోరైట్‌ వంటివి పిచికారీ చేయిస్తున్నారు. రెండు రోజులకోసారి బ్లీచింగ్‌ చేయిస్తున్నారు. సిబ్బందిని నియమించుకుంటున్నారు. పని మనుషుల విషయంలో ఉష్ణోగ్రతలు చూసి సాధారణంగా ఉంటే అనుమతిస్తున్నారు.
  • ఆదుకునేందుకు సిద్ధం

అనుకోకుండా ఎవరైనా కరోనా బారినపడితే కాలనీ సంఘాలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి.‘‘మా కాలనీలో కొందరు కరోనా బారిన పడ్డారు. వారికి అల్పాహారం, సరకులు, కూరలు అందించడం జరిగింది. వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి కమ్యూనిటీలోని వైద్యులతో అవసరమైన సూచనలు ఇప్పించాం’’ అని హిల్‌కౌంటీ విల్లాస్‌ అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు.

  • విందులు, వినోదాలు లేవు

గేటెడ్‌ కమ్యూనిటీల్లోని క్లబ్‌హౌస్‌లు కొన్ని రోజులుగా వెలవెలబోతున్నాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో ఆటవిడుపు కార్యక్రమాలు, ఫంక్షన్లు నిర్వహించుకునేవారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం నిబంధనల దృష్ట్యా అటువంటివి పూర్తిగా నిషేధించారు. విందులు, వినోద కార్యక్రమాలు జరపవద్దని ప్రకటించారు.

నిత్యం శానిటేషన్‌ కార్యక్రమాలు

శానిటేషన్‌పై శ్రద్ధ పెట్టాం. అంతర్గత రహదారుల్లో బ్లీచింగ్‌ చల్లిస్తున్నాం. కాలనీలోకి వచ్చేవారికి థర్మల్‌స్క్రీనింగ్‌ తప్పనిసరి చేశాం. క్లబ్‌హౌస్‌లో విందులు, వినోదాలపై నిషేధం విధించాం. తద్వారా కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

- కొండా ఉమాకాంత్‌రెడ్డి, గ్రీన్‌ఎవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నిజాంపేట

ఇదీ చూడండి: చిల్లంగి నెపంతో యువకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.