ETV Bharat / city

లాభాల బాట పట్టించటం చేతకాక.. ఛార్జీలు పెంచుతారా ?: సోము వీర్రాజు - ఆర్టీసీ ఛార్జీల పెంపు

ఆర్టీసీని లాభాల బాట పట్టించటం చేతకాక ఏకపక్షంగా ఛార్జీలు పెంచటం ఏంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లాభాల బాట పట్టించటం చేతకాక.. ఛార్జీలు పెంచుతారా ?

author img

By

Published : Apr 13, 2022, 9:11 PM IST

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్యులు ప్రయాణం చేసే పల్లె వెలుగు బస్సు కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయించటం దారుణమన్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు ఆర్టీసీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ధ్వజమెత్తారు. 20 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్ధానాలకు చేరుస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం.. ఛార్జీలను పెంచి ప్రజలకు ప్రయాణాలు లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రకటించి.. ఇప్పడు ఛార్జీలు పెంచటం ప్రభుత్వ లోపభూయిష్ట విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ఏకపక్షంగా ఛార్జీలు పెంచడం తగదని హితవు పలికారు.

ప్రయాణికులపై అదనపు భారం: డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది.

ఇదీ చదవండి: ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.