snow at vijayawada: గత మూడు రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో విజయవాడ నగరవ్యాప్తంగా మంచు కప్పేసింది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు సైతం మంచుతో నిండి ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు రోడ్లన్నీ మంచుదుప్పటి పరుచుకున్నట్లు ఉన్నాయి.
రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండటం వల్ల వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. రహదారి కనిపించకుండా ఉండటంతో వాహనం లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. చలికి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి:
Amaravati Protest: అమరావతి ఉద్యమానికి 800 రోజులు.. నేడు ప్రత్యేక కార్యక్రమాలు