రాష్ట్రంలో రూ.2,134 కోట్ల పెట్టుబడులతో.. కొత్తగా 5 పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ(SIPB PERMISSION TO NEW INDUSTRIES IN THE STATE) పచ్చజెండా ఊపింది. ఈ పరిశ్రమల ద్వారా 7,683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలకు అవకాశం లభించనున్నట్లు పేర్కొంది. కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ, పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్, బద్వేలులో సెంచురీ ప్లైవుడ్ తయారీ పరిశ్రమ, తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమలు రానున్నాయి. ఈ పరిశ్రమలకు భూ కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్(CM YS JAGAN) అధికారులను ఆదేశించారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్నచోట భూములను కేటాయించాలని సూచించారు. విస్తరించాలనుకునే పరిశ్రమలకు తగిన వనరులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Varla Ramaiah: హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు సిగ్గుపడాలి: వర్ల రామయ్య