Married Woman Tries to Kidnap her Boy Friend : 3 నెలలుగా వారిద్దరి మధ్య అసలు మాటలు లేవు. ఇష్టపడినవాడు ఏమో దూరం పెడుతున్నాడు. చేజారిపోతాడు ఏమో అన్న భయం, మరోవైపు వాటికి ఎలాగైనా ముగింపు పలకాలని నిశ్చయించుకుని ఓ మహిళ తన ప్రియుడిని ఏకంగా అపహరించేందుకు ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసుల ఆమె వెంబడించి వారి ఆటకట్టించారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన పూర్వాపరాలను తిరుపతి పడమర సీఐ రామకృష్ణ మీడియాకు వివరించారు.
వీరద్దరి మధ్య విభేదాలు, గొడవలు : సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా పెనుమూరు సమీపంలోని రేణుకా నగర్‌కు చెందిన శ్రీనివాసులు (31) తిరుపతిలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక పెద్దకాపు వీధిలోని పార్థ డెంటల్ ఆసుపత్రి ఎదురుగా లాడ్జిని సైతం నిర్వహిస్తున్నారు. అతనికి పెళ్లి కాలేదు. అవివాహితుడైన శ్రీనివాసులుకి మదనపల్లెకి చెందిన వివాహం అయిన సోనియా భానుతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త మృతి చెందాడు. శ్రీనివాసులు, సోనియా భానుల పరిచయం కాస్తా ప్రేమగా మారిది. ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకునే వరకు వచ్చింది. 3 నెలలుగా వీరద్దరి మధ్య విభేదాలు, గొడవలు వచ్చాయి. దీంతో ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో దూరమయ్యారు.
ఫ్రెండ్ కోసం కిడ్నాప్ ప్లాన్ - బెడిసికొట్టిన వ్యూహం
ప్లాన్ రచించి కిడ్నాప్ : శ్రీనివాసులును ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న సోనియా భాను చివరకు కిడ్నాప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మదనపల్లెకి చెందిన ఐదుగురు యువకులతో కలిసి ఓ ప్లాన్ రచించింది. దానికి వారు ఓకే చెప్పారు. ముందుగా అనుకున్న విధంగా కారులో గురువారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చారు. అనంతరం వారందరూ శ్రీనివాసులును కిడ్నాప్ చేశారు. శ్రీనివాసులు నిర్వహిస్తున్న లాడ్జి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ప్రత్యేక బృందాలతో కిడ్నాపర్లను వెంటాడారు.
కేసు నమోదు : అన్నమయ్య జిల్లా వాయల్పాడు వద్ద వెళ్తున్న కిడ్నాపర్ల కారును పోలీసులు అడ్డుకున్నారు. వారికి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మదనపల్లెకి చెందిన బాబా ఫకృద్దీన్, రాజేష్, మోక్షిత్, సందీప్, రియాజ్‌లుగా గుర్తించారు. బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
కొడుకు అప్పు చెల్లించడం లేదని తల్లి కిడ్నాప్ - భయంతో దాక్కున్న కోడలు