నటుడు నందమూరి బాలకృష్ణ కుడి భుజానికి శస్త్రచికిత్స చేసినట్లు హైదరాబాద్ కేర్ ఆస్పత్రి(Shoulder surgery to Balayya) వైద్యులు ప్రకటించారు. ఆరు నెలలుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరినట్లు(Shoulder surgery to Balayya) వైద్యులు తెలిపారు. కుడి చేతిని పైకి ఎత్తలేకపోతున్నానని.. చాలా నొప్పిగా ఉంటుందని బాలయ్య తెలిపినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రి షోల్డర్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం దాదాపు నాలుగు గంటలపాటు(Shoulder surgery to Balayya) బాలయ్యకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి:
Badvel bypoll: జగన్ కంటే సుధకు అధిక మెజార్టీ.. నేతలకు సీఎం అభినందనలు