విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవ కమిటీ సభ్యులు... అమ్మవారికి బంగారు బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 11.30 గంటలకు బ్రాహ్మణవీధి, జమ్మిదొడ్డి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఆలయం వరకు బోనాలతో కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి.
ఇదీ చదవండి.. సీఎం జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు: వెల్లంపల్లి