శ్రీవారి పట్ల విశ్వాసం లేని వారే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీవారి పట్ల ముఖ్యమంత్రి జగన్కు విశ్వాసం ఉందని..డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వస్త్రధారణ, దేవుని పట్ల గౌరవమే విశ్వాసానికి నిదర్శనమన్నారు. పలు నదుల్లో పుణ్యస్నానాలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని గుర్తు చేశారు. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే విధానం తమదని స్పష్టం చేశారు.
ఎవరినీ మోసం చేయలేదు
అమరావతిలో ప్రభుత్వం ఎవరినీ మోసం చేయలేదని సజ్జల అన్నారు. రాజధానిలో నిజమైన రైతులు 30శాతం మంది కూడా లేరన్న ఆయన... మిగిలిన వారంతా పెట్టుబడిదారులేనన్నారు. ప్రస్తుతం ఏడ్చేవాళ్లంతా తెదేపా దళారీలు, కమీషన్లు పోయినవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని విమర్శించారు. రాజధానిని తాము మార్చడం లేదని....అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు.
విమర్శలు సరికావు
నవ నగరాలు నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు రాజధాని ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలోని ప్రజలే ఓట్లు వేయలేదన్న ఆయన....వైకాపాను నమ్మి గెలిపించారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. రాజధానిని మార్చటం రాజ్యాంగ విరుద్ధమనేలా విమర్శించడం సరికాదన్నారు.
ఇదీచదవండి