ఈ నెల 20 నుంచి ప్రథమ్ మొబైల్ యాప్ ద్వారా... బస్సుల్లో టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలతో... ఆన్లైన్ ద్వారా టికెట్ల జారీని ప్రారంభించాలనే నిర్ణయం మేరకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 19 డిపోల్లో మొబైల్ యాప్ ద్వారా టికెట్లను జారీ చేయాలని ఎండీ నిర్ణయించారు.
విజయవాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం-1 డిపోలు, కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, రావులపాలెం, నెల్లూరు -1, చిత్తూరు-2 డిపోలు, తిరుపతి, కర్నూలు-1, తాడిపత్రి, గుంటూరు -1, 2 డిపోల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా కండక్టర్లు, డ్రైవర్లు ప్రత్యేక మొబైల్ సమకూర్చుకోవాలని ఆదేశించారు. సూచించిన ప్రమాణాల మేరకు సిబ్బంది స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు. సిబ్బందికి యాప్ సహా అవసరమైన సాఫ్ట్వేర్ ఆర్టీసీ అందిస్తుందని... ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఈడీలు,అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు.
ఇదీ చదవండి: గ్రామాల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి పరిశుభ్రత పక్షోత్సవాలు