ఆర్టీసీ సిబ్బందికి.. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్లు... ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈ హెచ్ఎస్ స్కీమును మార్చి నెల నుంచి ప్రారంభించామన్నారు. 50,500 మంది ఉద్యోగుల రికార్డులను ఆరోగ్యశ్రీ అధికారులకు పరిశీలన కోసం పంపినట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కార్డులు వీలైనంత త్వరగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న సిబ్బందికి... పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వైద్యానికి అయ్యే ఖర్చులు చెల్లిస్తామన్నారు. ఆర్టీసీ ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలందిస్తున్నామన్న ఎండీ.. వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. కొవిడ్ కేసులు వస్తే వాటిని రెఫరల్ ఆస్పత్రులకు పంపుతున్నామని వివరించారు.
ఇవీ చదవండి:
వ్యక్తిగత వాహనాల్ని ఏ రాష్ట్రానికైనా తీసుకెళ్లొచ్చు
'క్లీన్ ఏపీ'లో గ్రామాలు, పట్టణాలు పూర్తి పారిశుద్ధ్యంగా ఉండాలి: సీఎం