ETV Bharat / city

పుర ఎన్నికల ప్రక్రియ పున:ప్రారంభం.. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే.. - high court on muncipal elections latest news

పురపాలక ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పురపాలక, నగరపాలక, నగర పంచాయతీ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో ఇదివరకు భద్రపరిచిన నామినేషన్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రిని తగిన పోలీసు బందోబస్తు మధ్య బయటకు తీయించాలని సూచించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించాలని పేర్కొంది.

resumption-of-municipal-election-process

author img

By

Published : Feb 26, 2021, 4:15 AM IST

75 పురపాలక, నగర పంచాయతీ, 12 నగరపాలక సంస్థల్లో వచ్చే నెల 2 నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి ముందస్తు ఏర్పాట్లపై పుర కమిషనర్లకు పురపాలకశాఖ పలు సూచనలు చేసింది.
* కరోనా కారణంగా గత మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేసినపుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై అప్పటికే దాఖలైన నామినేషన్లు, సంబంధిత పత్రాలు, గ్రీన్‌పేపర్‌ సీళ్లు, ఇతర సామగ్రిని జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లో భద్రపరిచారు. ఎన్నికల సంఘం ఈ నెల 15న తాజా ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేయడంతో.. భద్రపరిచిన పోలింగ్‌ సామగ్రిని బయటకు తీస్తున్నారు.
* నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించేందుకు స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ముద్రణ సంస్థల పేర్లను కమిషనర్లు కలెక్టర్లకు పంపారు. గతంలో తెప్పించిన చెరగని సిరా (ఇండిలిబుల్‌ ఇంక్‌)కు కాలం చెల్లిపోవడంతో 40 వేల కొత్త ఇంకు బాటిళ్లు తెప్పిస్తున్నారు.
* ఇప్పటికే సిద్ధం చేసిన 9,307 పోలింగు కేంద్రాల్లో 109 చోట్ల మార్పులు అవసరమని కమిషనర్లు ప్రతిపాదించారు. వీటిపై సంబంధిత కలెక్టర్లు ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. 18 పురపాలక సంఘాల్లో పోలింగ్‌ కేంద్రాల కోసం కేటాయించిన భవనాలను గత 11 నెలల్లో వేరే అవసరాలకు వినియోగించారు. దీంతో సమీపంలో మరోచోట పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కమిషనర్లు ప్రతిపాదించారు.
* గతంలో 666 మంది ఎన్నికల అధికారులు, 670 మంది అదనపు, సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. వీరిలో 12 శాతం మంది బదిలీ, పదవీవిరమణ తదితర కారణాలతో ప్రస్తుతం అందుబాటులో లేరు. వారి స్థానంలో అదే హోదా గల అధికారులను నియమించనున్నారు.
గరిష్ఠ వ్యయపరిమితి రూ.2 లక్షలు
పుర, నగరపాలక, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. నగరపాలక సంస్థల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి ఎన్నికల ప్రచార ఖర్చును గరిష్ఠంగా రూ.2 లక్షలుగా నిర్ణయించింది. పురపాలక సంఘాల్లో రూ.1.50 లక్షలు, నగర పంచాయతీల్లో రూ.లక్ష వరకు ఖర్చు చేసేలా పరిమితి విధించింది. అభ్యర్థులు ప్రతి మూడు రోజులకోసారి ప్రచార ఖర్చులను ఎన్నికల అధికారులకు అందించాలి. లెక్కల పరిశీలన కోసం రాష్ట్ర ఆడిట్‌, ఖజానా, గణాంక శాఖల అధికారులను తాత్కాలికంగా నియమించి, తగిన శిక్షణ ఇప్పించాలని ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది. తాము పురపాలక శాఖకు పంపిన ప్రత్యేక నమూనా ప్రకారం అభ్యర్థుల నుంచి ఖర్చుల వివరాలు తీసుకోవాలని ఆదేశించింది. ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు చేసిన ఖర్చులపై మరోసారి సమగ్ర నివేదిక అధికారులకు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.