రేషన్ డీలర్లతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజాశంకర్తో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదని.. బుధవారం కూడా గిడ్డంగుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డీలర్లు తెలిపారు.
రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదని మంత్రి కొడాలి నాని అన్నారు. మనకు రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని.. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డీలర్లకు సూచించారు.
ఇదీ చదవండి.. : చాలా మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే: సీఎం జగన్