ETV Bharat / city

రాంప్రసాద్ వేధించేవాడు... శ్యామ్ భార్య! - syamprasad

"రాంప్రసాద్ నా భర్తను వేధించేవాడు. అర్థరాత్రి పోలీసులను ఇంటికి పంపించి ఇబ్బందికి గురిచేసే వాడు. అక్రమ కేసులు బనాయించి.. కోర్టుల చుట్టూ తిప్పేవాడు" అంటూ సంచలన ఆరోపణలు చేశారు వరలక్ష్మి. రాంప్రసాద్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా చెప్పుకుంటున్న శ్యామ్ భార్య వరలక్ష్మి.

రాంప్రసాద్​ అన్యాయంగా కేసుల పెట్టి జైలుకు పంపించాడు
author img

By

Published : Jul 8, 2019, 10:38 PM IST

రాంప్రసాద్​ను తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి తెరపైకి రావటంతో కేసు కీలక మలుపు తిరిగింది. విజయవాడ కృష్ణలంకలో నివసించే శ్యామ్ అలియాస్ టెక్కెం శ్యాంప్రసాద్... పథకం ప్రకారమే రాంప్రసాద్​ను హత్య చేశానని హైదరాబాద్​లో పోలీసులకు లొంగిపోయాడు. కోగంటి సత్యం ఆర్థికసాయంతోనే... శ్యామ్ కృష్ణలంకలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. 2013లో రాంప్రసాద్ తమను వేధించాడని శ్యామ్ భార్య వరలక్ష్మి ఆరోపించారు. తన భర్తపై అన్యాయంగా కేసులు పెట్టించి జైలుకు పంపించాడని వాపోయారు. 2013లో విజయవాడ పోలీసులు అర్ధరాత్రి తమ ఇంట్లో తనిఖీలు చేశారని తెలిపారు. రాంప్రసాద్ పెట్టిన కేసులు కారణంగా తన భర్త కోర్టు చుట్టూ తిరుగుతున్నాడని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల కిందట వాయిదాకు వెళ్లొస్తానని ఇంటి నుంచి వెళ్లిన శ్యామ్... ​హత్యకు గురైనట్టు తనకు తెలియదని చెప్పారు. రాంప్రసాద్ కేసులో కీలక నిందితుడు శ్యామ్ 20 యేళ్ల నుంచి కోగంటి సత్యంకు అనుచరునిగా ఉంటున్నారు. 2013 రాంప్రసాద్ కిడ్నాప్ కేసులో కోగంటి సత్యంతో పాటు శ్యామ్​పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో 13 రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు. రాంప్రసాద్ తనకు ఇవ్వాల్సిన డబ్బివ్వకుండా... అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నందుకు హత్య చేశానని శ్యామ్ హైదరాబాద్ లో తెలిపాడు. విజయవాడలోని తన వాటర్ ప్లాంట్ లోనే మారణాయుధాలు తయారు చేసినట్లు పేర్కొన్నాడు.

Intro:ap_tpg_81_8_rytudinotsavam_ab_ap10162

Body:రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులు అధిక అభివృద్ధి సాధించాలని దెందులూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుబ్బిరెడ్డి అన్నారు పెదవేగి మండలం రాష్ట్రాలు గుంటలో వైయస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు గూగుల్ రైతు భరోసా కింద 12,500 రూపాయలు అందిస్తుందన్నారు ప్రతి ఒక్కరు పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు పలు శాఖల అధికారులు వారి పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార ప్రతినిధి కొటారు రామచంద్రరావు మాట్లాడుతూ మన గుర్తింపు కార్డు జారీలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని అన్నారు ప్రస్తుత అటువంటివారికి తావు లేకుండా రెండు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు అనంతరం ఉత్తమ రైతులను సహకరించడంతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేశారు పలువురికి బ్యాంకు రుణాలను అందించారు ఈ కార్యక్రమంలో ఎ డి ఎ నరేంద్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు పలు శాఖల అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.