విజయవాడలో నూతన రాజ్‌భవన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గవర్నర్ ప్రమాణ స్వీకారం 24వ తేదీ జరగనున్నందున సిబ్బంది రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. నూతన ఫర్నీచర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజ్‌భవన్‌లోని పై అంతస్తులో ఒక వైపు గవర్నర్ నివాసముంటుంది. మరోవైపు అతిథులకు ప్రత్యేక గదులు, ప్రెసిడెన్స్ రూంలుగా అధికారులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో గవర్నర్ కార్యాలయం, డెలిగేషన్ రూంలను ఏర్పాటు చేశారు. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సిసోడియా పూర్తి స్థాయిలో పనులను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాజ్‌భవన్ ప్రాంగణంలోనే జరపనున్నందున... దీనికి సంబంధించి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
24న గవర్నర్ ప్రమాణం.. ముస్తాబవుతోన్న రాజ్‌భవన్
రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 23 సాయంత్రానికే ఆయన విజయవాడకు చేరుకోనున్నారు. ఈలోపే రాజ్‌భవన్ పనులు పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. సకల సౌకర్యాలతో భవనాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు