ETV Bharat / city

నైరుతి ప్రభావంతో.. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే పలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాల్లో నీరు నిలిచింది.

rains in karnulu and krishna distirct
rains in karnulu and krishna distirct
author img

By

Published : Jun 27, 2021, 12:14 PM IST

Updated : Jun 27, 2021, 12:26 PM IST

కర్నూలు జిల్లాలో భారీ వర్షం

కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి నుండి వర్షం కురుస్తోంది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడం పట్ల రైతులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి వర్షపు నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలిలో పంట పొలాలు నీట మునిగాయి. కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులో చిక్కుకున్న లారీ డ్రైవర్​ను స్థానికులు కాపాడారు.

కృష్ణా జిల్లాల్లో..

మోపిదేవి మండలం, కోసురువారిపాలెం, నాగాయతిప్ప, మెల్లమర్తిలంక, బొబ్బర్లంక, మోపిదేవి గ్రామాల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

లోకేష్ ఫొటోకు టీఎన్ఎస్ఎఫ్ పాలాభిషేకం

Last Updated : Jun 27, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.