ETV Bharat / city

భక్తి పేరుతో సైబర్ మోసం... ఇద్దరు కేటుగాళ్లు అరెస్ట్​ - Two persons arrested for cyber crime

సైబర్​ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్​లో సైబర్​నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సూచించారు.

Two persons arrested for cyber crime
భక్తి పేరుతో సైబర్ మోసం... ఇద్దరు కేటుగాళ్లు అరెస్ట్​
author img

By

Published : Nov 23, 2020, 6:49 PM IST

సోషల్​ మీడియా ఆధారంగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్​ రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్​, ఫేస్​బుక్, ఇస్టాగ్రాం ఆధారంగా సైబర్​ క్రైమ్​లకు పాల్పడుతున్న ముఠాను​ అరెస్టు చేశారు. ఛారిటీకి సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు డిపాజిట్​ అవుతాయంటూ... ఓ బాధితురాలికి కుచ్చుటోపి పెట్టి 29 లక్షల రూపాయలను మోసం చేశారు.

భక్తి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాలని ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తామంటూ బురిడీ కొట్టించాడు. సోనియా శర్మ పేరుతో బాధితురాలికి ఫోన్, మెయిల్​ల ద్వారా ఉచ్చులోకి దింపారు. డిపాజిట్​కు ముందు కొన్ని కస్టమ్స్, ఆర్బీఐ ఛార్జీలు చెల్లించాలంటూ 29 లక్షల రూపాయలను వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులను పట్టుకునేందుకు దిల్లీలో సోనియా కమ్యూనికేషన్స్ వద్ద నగదు డ్రా చేసినట్లు గుర్తించారు. సోనియా కమ్యూనికేషన్​పై నిఘా వేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నైజీరియాకు చెందిన చిబుకి క్రిస్టియన్, అరుణ్​ను అదుపులోకి తీసుకున్నారు. సోనియా కమ్యూనికేషన్ వీళ్లిద్దరికీ 15 శాతం కమిషన్ ఇస్తుందని, నైజీరియన్​ను అరెస్టు చేసే సమయంలో కానిస్టేబుల్, ఆర్​ఐలపై దాడి చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

వీరి వద్ద నుంచి నాలుగు పీఓఎస్ మిషిన్లు, ఒక ల్యాప్​టాప్, 2 సెల్​ఫోన్లు, 74వేల డిపాజిట్ స్లిప్లు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీప మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి :

రాజమహేంద్రవరంలో విషాదం...నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.