ETV Bharat / city

AP JAC Employees on PRC: "డిమాండ్లు నెరవేర్చేదాకా.. పోరాటం కొనసాగిస్తాం"

AP JAC Employees on PRC: ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన నిరసన.. 4వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి.

protest-ap-jac-employees-on-prc
protest-ap-jac-employees-on-prc
author img

By

Published : Dec 13, 2021, 4:33 PM IST

4వ రోజుకు చేరిన ఉద్యోగులు చేపట్టిన నిరసన

AP JAC Employees on PRC: తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన నిరసన.. 4వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి. గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

విజయవాడలో స్టాలిన్ కార్పొరేషన్ భవనం వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. పీఆర్సీ అమలు కోసం అనంతపురంలో టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్జీవోలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని, CPS రద్దు చేయాలని తిరుపతిలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరులోనూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

"పీఆర్సీ ప్రకటించండని చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం సలహాదారును, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా కలిశాం.. మా డిమాండ్లను చెప్పాం. అయినా.. ప్రభుత్వంలో కదలిక లేదు" - ఉద్యోగులు

ఇదీ చదవండి:

LOKESH ON CID: సీఐడీకి సరికొత్త అర్థం చెప్పిన లోకేష్.. జగన్ అలా మార్చేశారంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.