రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు(JUDGES TRANSFER ORDERS BY HIGH COURT) జారీచేసింది. పలువురికి పదోన్నతి కల్పించింది. చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తేన్న వైవీఎస్ బీజీ పార్ధసారధిని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇప్పటి వరకు చిత్తూరు పీడీజేగా సేవలు అందించిన ఏవీ రవీంద్రబాబును.. గుంటూరు జిల్లా పీడీజేగా బదిలీ చేశారు. కడప ఆరో అదనపు జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తిని విజయనగరం పీడీజేగా నియమించారు. విజయనగరం పీడీజే జి.గోపిని శ్రీకాకుళం జిల్లా పీడీజేగా బదిలీ చేశారు. శ్రీకాకుళం పీడీజే జి. రామకృష్ణను కృష్ణాజిల్లా పీడీజేగా నియమించారు. వీరితో పాటు పలువురు అదనపు జిల్లా జడ్జిలకు వివిధ ప్రాంతాలకు బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. హైకోర్టు రిజిస్ట్రార్ సునీత ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి:
HC: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతిని నిర్ణయించండి..హిందూ ధార్మిక పరిషత్‌కు హైకోర్టు ఆదేశం