.
హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు
హైదరాబాద్ శిల్పారామం సంక్రాంతి సంబురాలతో రంగులీనుతోంది. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దు విన్యాసాలతో సందడిగా మారింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన గిరిజనులు డప్పు చప్పుళ్ల మధ్య కాలు కదిపారు. హరిదాసుల గానం, పిట్టల దొర ముచ్చట్లతో శిల్పారామ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వారం రోజుల పాటు సంక్రాంతి వేడుకలతో శిల్పారామం విరాజిల్లనుంది.
హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు
.
TG_HYD_33_13_SANKRANTHI_CELEBRATIONS_AT_SHIlPARAMAM_AVB_7202041
Reporter: Rajkumar Camera : Niranjan
() సంక్రాంతి వేడుకలు మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగిరెద్దుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజనులు... డప్పు చప్పుళ్ల మధ్య తమ కాలిని కదిపారు. హరిదాసుల, పిట్టల దొర, ఎరుక చెప్పే వాళ్లు, కుమ్మదాసరి తదితరుల విన్యాసాలను సందర్శకులు తిలకించారు. వారం రోజుల పాటు ఈ సంక్రాంతి వేడుకలు జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఉప్పల్ లోని శిల్పారామంలో కూడా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయని, ప్రజలు అక్కడ కూడా వీటిని తిలకించవచ్చని వెల్లడించారు.
look....
Voxpop...